TG: పేద పిల్లలు చదువులో వెనుకబడకూడదని.. వారిని మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి పొంగులేటి తెలిపారు. కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. ప్రతి విద్యార్థిని సమాజంలో ఒక ఆభరణంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఖమ్మం(D) కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు.