అరుణాచలం కొండపై వెలిగిన మహాదీపం

కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా తమిళనాడులోని తిరువణ్ణామలైలో గల అరుణాచలేశ్వర ఆలయంలో మహాదీపం అత్యంత వైభవంగా వెలిగింది. ఈ అద్భుత ఆధ్యాత్మిక ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తి పారవశ్యంతో భక్తులు గిరి ప్రదక్షిణ కొనసాగిస్తుండటంతో తిరువణ్ణామలై పట్టణం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక అధికారులు మరియు ఆలయ సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕