నిమజ్జనోత్సవాల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి: మంత్రి పొన్నం

TG: గణేశ్ నిమజ్జనోత్సవాల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్సవ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. వర్షం కురిసే అవకాశమున్నందున ఈ దిశగా ఆలోచించాలని ఆయన కోరారు. ఈ రోజు రాత్రి వరకు నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, సీపీ సజ్జనార్, కలెక్టర్ ప్రియాంక ఆల, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్‌తో కలిసి నిమజ్జనోత్సవ ప్రక్రియను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్

✕
✕