ప్రియురాలిని ముక్కలు చేసిన ఘటన.. వెలుగులోకి నిజాలు

AP: విశాఖపట్నంలోని గాజువాకలో నేవీ ఉద్యోగి రవీంద్ర తన ప్రియురాలు మౌనికను హత్య చేసి శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రవీంద్రకు మౌనికతో మూడేళ్లుగా పరిచయం ఉంది. ఇటీవల రవీంద్ర మరో యువతిని వివాహం చేసుకున్నాడు. తనను కూడా పెళ్లి చేసుకోవాలని మౌనిక కొద్దిరోజులుగా రవీంద్రను ఒత్తిడి చేస్తోంది. మౌనికను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన రవీంద్ర ఆమెను ఫ్లాట్‌కు పిలిపించుకున్నాడు. ఆమెను చంపిన తర్వాత శ్రీకాకుళంలో ఉన్న స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు.

సంబంధిత పోస్ట్