ది కేరళ స్టోరీ సీక్వెల్‌.. టీజర్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

ఆదా శర్మ నటించిన 'ది కేరళ స్టోరీ' చిత్రం రెండు జాతీయ అవార్డులు గెలుచుకుంది. దర్శకుడు సుదీప్తో సేన్‌కు ఉత్తమ దర్శకుడిగా, సినిమాటోగ్రఫీకి అవార్డులు దక్కాయి. ఇప్పుడు 'ది కేరళ స్టోరీ 2 - గోస్ బియాండ్' పేరుతో సీక్వెల్ రానుంది. పార్ట్ 2కు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా, అదితి భాటియా కీలక పాత్రల్లో నటించారు. ముగ్గురు హిందూ అమ్మాయిలు ఎలా మోసపోయారనే కోణంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. 2023లో వచ్చిన 'ది కేరళ స్టోరీ' కేరళలో మహిళలు ఇస్లాంలోకి ఎలా మారారు, లవ్ జిహాద్ ఉచ్చులో ఎలా చిక్కుకున్నారు అనే ఇతివృత్తంతో తెరకెక్కింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్