భువనేశ్వర్‌లో తెలంగాణకు చెందిన ముగ్గురు మహిళలు ఒక హ్యాండ్లూమ్ షాపులో సుమారు 7 లక్షల రూపాయల విలువైన 25 ఖరీదైన చీరలను దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో ఒత్తిడికి గురైన మహిళలు, దొంగిలించిన 24 చీరలను పార్సిల్ చేసి తిరిగి అదే షాపుకు పంపించారు. షాప్ యజమాని ఫోన్ చేయగా, మహిళలు తమ తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు, చీరలు తిరిగి ఇచ్చినా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.