TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత KCRకు సిట్ నోటీసులు ఇవ్వడంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని ఆయన తెలిపారు. అలాంటి ఉద్దేశం ఉంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో చాలా మందిపై కక్ష సాధింపులకు దిగేవాళ్ళమని చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తున్నామని, చట్టం తన పని తాను చేసుకుపోతోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.