TG: జగిత్యాల జిల్లా కోరుట్లలో ఒకే రోజులో రాజకీయ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. పట్టణ 8వ వార్డు కౌన్సిలర్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న తోట గంగాధర్ గురువారం ఉదయం ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ సమక్షంలో BRSలో చేరారు. కాంగ్రెస్‌లో టికెట్ దక్కకపోవచ్చన్న అంచనాతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు రాత్రి మెట్‌పల్లిలోని పార్టీ కార్యాలయానికి పిలిపించి, 8వ వార్డు అభ్యర్థిగా ప్రకటిస్తూ కండువా కప్పి తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు.