దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యరూపం దాల్చడంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. ఈ రైల్వే జోన్ ఏర్పాటు ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని ఆయన అన్నారు. జోన్ ప్రారంభం సందర్భంగా ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో ప్రజలు, రైల్వే అభిమానులు సంబరాలు నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్రలో రైల్వే మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.