ఈ ఏడాది భూమిపై శక్తివంతమైన ఎల్‌నినో ఏర్పడుతుందని, జూన్ నెల నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ తెలిపింది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతాయని, ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని, రుతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. పసిఫిక్ మహా సముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ‘ఎల్ నినో’ అంటారు. సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైతే దానిని ‘సూపర్ ఎల్‌నినో’గా పరిగణిస్తారు. గతంలో 1982-83, 1997-98, 2015-16లో ఇటువంటి భారీ మార్పులు సంభవించాయి.