ముంచుకొస్తున్న ‘ఎల్‌నినో’ ముప్పు

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ఈసారి బలంగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ప్రపంచ వాతావరణ సరళి మారిపోవచ్చని, రుతుపవన వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు, మరికొన్ని చోట్ల కరువు పరిస్థితులు ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. భారత్‌లో సాధారణంగా ఎల్‌నినో సంవత్సరాల్లో వర్షపాతం తగ్గుతుందని, దీంతో పంటల ఉత్పత్తి, నీటి వనరులు, ఆహార భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్