ఒడిశాలోని కేంఝర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తన అక్క మరణాన్ని నిరూపించేందుకు గిరిజనుడైన జీతూ ముండా అసాధారణ చర్యకు దిగాడు. తన అక్క ఖాతాలో ఉన్న రూ.20 వేల కోసం 3 నెలలుగా బ్యాంకు చుట్టూ తిరిగినా సిబ్బంది డబ్బు ఇవ్వకపోవడంతో, సమాధి తవ్వి అక్క అస్థిపంజరాన్ని తీసుకొచ్చి బ్యాంకు ఎదుట చూపించాడు. దీంతో అధికారులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని, అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి డబ్బు అందిస్తామని జీతూకు హామీ ఇచ్చారు.