ఆ గుడిలో అద్భుతం.. నీటితోనే దీపం వెలుగుతుంది!

మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో గడియా ఘాట్ మాతా దేవాలయంలో ఒక వింత సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ గుడిలో ఉన్న దీపం కాళీసింధ్ నది నీటితో వెలుగుతుంది. దశాబ్దాల క్రితం ఒక పూజారికి కలలో అమ్మవారు కనిపించి, నూనె బదులు నది నీటితో దీపం వెలిగించమని ఆదేశించారని, అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందని పురోహితులు చెబుతున్నారు. వానాకాలంలో ఆలయం నీట మునిగినప్పుడు దీపారాధన నిలిపివేసి, నవరాత్రులలో తిరిగి ప్రారంభిస్తారు. #Hidden Secrets of Telugu Temples ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఇలాంటి ఆలయ విశేషాలు తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్