తిరుమలలో అత్యంత వైభవంగా స్వామివారికి చక్రస్నానం (వీడియో)

AP: తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజు గురువారం అత్యంత వైభవంగా స్వామివారికి చక్రస్నానం జరిగింది. శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారు బంగారు తిరుచ్చిపై భక్తులకు ఉరేగింపుగా దర్శనమిస్తారు. రాత్రి 8 గంటలకు ధ్వజావరోహణం జరుగుతోందని, దీంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్