TG: శ్రీరామనవమి పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నేతృత్వంలో నిర్వహించిన శోభాయాత్ర అత్యంత వైభవంగా ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం ధూల్‌పేట్ ఆకాశపురి హనుమాన్ మందిర్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర.. అర్ధరాత్రి కోఠి హనుమాన్ వ్యాయామ శాల వద్దకు చేరుకుంది. దారి పొడుగునా వేలాది మంది భక్తుల 'జై శ్రీరామ్' నినాదాలతో మార్మోగింది. యాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.