AP: అనంతపురం (D) కంబదూరు (M) నూతిమడుగుకు చెందిన సూరి, శివలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతపురంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడబిడ్డలు, ఒక మగ బిడ్డ ఉండగా.. తాజాగా ఆ దంపతులకు మరో ఆడబిడ్డ జన్మించింది. ఆర్థిక ఇబ్బందులతో పుట్టిన ఆడబిడ్డను పోషించలేమని.. హిందూపురం పట్టణానికి చెందిన మహిళకు 2 రోజుల పసికందును ఇచ్చి హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు. అయితే ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాలింత శివలక్ష్మిని తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం పసిపాపను తల్లి చెంతకు చేర్చారు.