పెళ్లైన నాలుగు రోజులకే నవ వధువు మృతి

TG: పెళ్లైన నాలుగు రోజులకే నవ వధువు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన మంచిర్యాల(D) నెన్నెల మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. నెన్నెలకు చెందిన జంబి స్వప్న(22) అదే గ్రామానికి చెందిన పల్లె సిద్ధు పెద్దలను ఒప్పించి ఈ నెల 4న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆదివారం అత్తవారిట్లో స్నానం చేయడానికి వాటర్‌ హీటర్‌ వాడారు. కరెంట్ పలుమార్లు ట్రిప్‌ అవ్వడంతో విద్యుత్తు సరఫరా లేదనుకున్న స్వప్న నీటిలో చెయ్యి పెట్టి హీటర్‌ తీశారు. దీంతో షాక్‌కు గురై మృతి చెందింది.

సంబంధిత పోస్ట్