వచ్చే 2 నెలలు నిప్పుల కొలిమే.. కేంద్రం హై అలెర్ట్

వేసవిలో తీవ్రమైన వడగాల్పులు వీయనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ నుండి జూన్ వరకు పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందని పేర్కొంది. ప్రజారోగ్య పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపిన లేఖలో, ఆరోగ్య కేంద్రాల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక నిర్వహణ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్