దేశంలో పెళ్లికాని యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యక్తిగత నిర్ణయాలు వంటి కారణాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నాయి. యుక్త వయసు జనాభాలో 51.1 శాతం మంది పెళ్లి చేసుకోలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో పురుషులు 56.3 శాతం, మహిళలు 45.7 శాతంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 47.5 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 43.7 శాతం పెళ్లికాని వారు ఉన్నారని జనాభా లెక్కల విభాగం వెల్లడించింది.