TG: రాజన్న సిరిసిల్ల జిల్లా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నారాయణపూర్‌కు చెందిన అనితకు, హుస్నాబాద్‌కు చెందిన మొగిలితో వివాహం కుదిరింది. నిన్న పెళ్లి జరగాల్సి ఉండగా.. అనిత తన ప్రేమికుడితో పరారైంది. దీంతో అనిత తల్లిదండ్రులు మొగిలికి అనిత చెల్లెలు లలితను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఆమె మైనర్ కావడంతో అధికారులు పెళ్లి ఆపేశారు. అంతలో లలిత కూడా ఇంటి నుంచి పారిపోయింది. ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.