ఒక్కటైన బ్రిటన్‌ అమ్మాయి.. ఖమ్మం అబ్బాయి

తెలంగాణలోని ఖమ్మంలో ఓ అంతర్జాతీయ ప్రేమకథ పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన సగ్గుర్తి భరత్, బ్రిటన్‌కు చెందిన ఎలిజబెత్ ఆదివారం హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఎంఎస్ చదివేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన భరత్ అక్కడి పెన్షన్ శాఖలో ఉద్యోగం సాధించారు. అదే శాఖలో పనిచేస్తున్న ఎలిజబెత్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕