ఎముకలు కొరికే చలిలోనూ కొనసాగుతున్న ఉగ్రవేట

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు భారీ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. తాజాగా పూంచ్ జిల్లా లోరాన్‌లోని గారంగ్ అటవీ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన రోమియో ఫోర్స్ ఒక రహస్య ఉగ్రస్థావరాన్ని ఛేదించింది. అక్కడ భారీ ఎత్తున ఐఈడీ (IED) తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా సైన్యం ఈ ప్రాంతంలో గాలింపు చర్యలను కొనసాగిస్తోంది.

సంబంధిత పోస్ట్