బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం లిఖిత అనే యువతి పెంపుడు చిలుక హైటెన్షన్ విద్యుత్తు తీగపై కూర్చోవడంతో, దానిని కాపాడే ప్రయత్నంలో అరుణ్ కుమార్ (32) అనే యువకుడు విద్యుదాఘాతంతో మరణించాడు. అపార్ట్‌మెంట్ ప్రహరీపై నిలబడి ఇనుప గొట్టంతో చిలుకను ఎగిరేలా చేసే క్రమంలో గొట్టం 66 కిలోవాట్ తీగకు తాకడంతో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.