TG: రాష్ట్రంలో బీసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడం జాగృతి సాధించిన విజయమని, బీసీ బిడ్డల విజయమని MLC కవిత అన్నారు. ఆర్డినెన్స్ ప్రకటించి, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదం పొందకుండా ఉంటే జాగృతి ఆధ్వర్యంలో రైల్ రోకో నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌పై నిరక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని చెప్పారు. బీసీ బిల్లును అమలు చేయకపోతే రాష్ట్రం మొత్తం పర్యటించి జాగృతి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.