రైలులో ఏసీ పనిచేయలేదని చైన్ లాగిన ప్యాసింజర్.. కొట్టుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు (వీడియో)

ట్రైన్‌లో ఏసీ సరిగా పనిచేయకపోవడంతో ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్‌ను పలుమార్లు లాగగా.. పోలీసులు అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటన పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటుచేసుకుంది. ట్రైన్ బోగీలో ఏసీ కూలింగ్ సరిగా లేకపోవడంతో అనంత్ పాండే అనే వ్యక్తి అయోధ్య సమీపంలో రైలును ఆపడానికి పలుమార్లు చైన్ లాగాడు. దీంతో ఆదివారం రాత్రి చార్‌బాగ్ స్టేషన్‌లో RPF అధికారులు పాండేను కోచ్ నుండి బయటకు లాగి అతనిపై దాడి చేశారు.

సంబంధిత పోస్ట్