తనను కాటేసిన పామును చంపాకే చికిత్స చేయించుకోవాలనుకున్న వ్యక్తి చివరకు చనిపోయాడు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిలో బర్మాకు చెందిన కొండన్న(38) MA బుద్ధిజం చదువుతున్నాడు. శనివారం పుట్టగొడుగులు కోస్తుండగా రక్తపింజరి కొండన్నను కాటేసింది. రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు దాని కోసం వెతికి దొరకడంతో ఆ పామును చంపేశాడు. ఆ తర్వాత మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో కొండన్న చనిపోయాడు.