నిమ్స్‌లో సామాన్యుడికి బెడ్ దొరకని దుస్థితి: కవిత (వీడియో)

TG: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో సాధారణ రోగులకు బెడ్లు దొరకని దుస్థితి నెలకొందని టీఆర్ఎస్ చీఫ్ కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచి ఫోన్ వస్తే తప్ప నిమ్స్‌లో బెడ్ దొరకడం లేదని, ఆక్సిజన్ బెడ్ కోసం సామాన్యులు 4 నుంచి 7 రోజులు నిరీక్షించాల్సి వస్తోందని ఆమె ఆరోపించారు. బెడ్లు లేక వీల్‌చైర్లలోనే రోగులకు చికిత్స అందిస్తున్న దుస్థితి ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు.

సంబంధిత పోస్ట్

✕
✕