భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ‘యుద్ధ్ అభ్యాస్ 2026’లో భారత ఆర్మీకి చెందిన AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్లు సత్తా చాటాయి. ఇరు దేశాల బలగాలతో కలిసి అపాచీలు ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ డ్రిల్స్‌లో పాల్గొన్నాయి. ఉమ్మడి విధానాలు, కమ్యూనికేషన్, సమన్వయాన్ని మెరుగుపరచడంతో పాటు మల్టీ డొమైన్ ఆపరేషన్ల ప్రణాళిక, సమీకరణ, అమలుపై ఇరు సైన్యాలు సంయుక్తంగా శిక్షణ చేపట్టాయి.