BJPకి ఉ.కొరియా అధ్యక్షుడే ఆదర్శం: రేవంత్‌

TG: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ వ్యవహారంలో ఆర్వోలు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్షుడిని ఆదర్శంగా తీసుకుందని ఎద్దేవా చేశారు. కిమ్ జోంగ్ ఉన్ లా బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారని, ఉత్తర కొరియాలో కూడా ఎన్నికలు జరుగుతాయని, కానీ ఫలితాలు అధ్యక్షుడు చెప్పిన విధంగా వస్తాయని అన్నారు. ఇప్పటి వరకు బీజేపీ ఓటు చోరీ చేసిందని, ఇప్పుడు సీటు చోరీ మొదలుపెట్టిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్