TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. బంజారాహిల్స్, వనస్థలిపురం, జూబ్లీహిల్స్, మాదాపూర్, హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్పేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కాసేపట్లో GHMC ఏరియాలోని మరిన్ని ప్రాంతాలకు వర్షం విస్తరించనుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ రానున్న 2 గంటల్లో వాసలు పడతాయని వివరించింది.