రజోత్సవ సభకు ఉద్యమంలా కదలి రావాలి: జగదీశ్ రెడ్డి

TG: వరంగల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలందరూ ఉద్యమంలా కదిలిరావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని, రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కేటీఆర్ పిలుపుతో కార్యకర్తలు, నేతలు అందరూ సభకు సిద్ధమయ్యారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్