ప్రముఖ నటి సమంత తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, తనలో వచ్చిన మార్పులకు, ధైర్యానికి ప్రధాన కారణం తన భర్త రాజ్ నిడిమోరు అని పేర్కొన్నారు. జీవితంలో ఎదురైన కష్టాల తర్వాత తాను మంచి వ్యక్తిగా, మంచి నటిగా మారడంలో ఆయన ప్రోత్సాహం కీలకమని తెలిపారు. ఇద్దరూ వృత్తిపరమైన పనులతో పాటు వర్కవుట్స్ కూడా కలిసి చేస్తామని, ఒక్కరోజు కూడా ఆయనకు దూరంగా ఉండలేనని సమంత భావోద్వేగంగా చెప్పారు. వ్యక్తిగత జీవితంలో రాజ్ అందిస్తున్న మద్దతు తనకు ఎంతో బలాన్నిస్తోందని వెల్లడించారు.