అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి విశ్వాస్‌కుమార్ రమేశ్ ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. తనను ఇప్పటికీ నాటి భయానక దృశ్యాలు వెంటాడుతూనే ఉన్నాయని విశ్వాస్ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాద దృశ్యాలు, ఘటనలో సోదరుడిని కోల్పోవడం వంటి వాటితో విశ్వాస్ మానసికంగా కుంగిపోయాడని అతని బంధువు ఒకరు పేర్కొన్నారు. ఆయన క్షేమం గురించి తెలుసుకునేందుకు విదేశాల్లోని బంధువులు ఫోన్‌లు చేస్తున్నారని తెలిపారు.