తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఐఎండి రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కొమరంభీమ్, నిర్మల్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని సూచించింది.