తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణి కార్తె రాకముందే నిప్పులు కురిపిస్తున్నాడు. మంగళవారం (ఏప్రిల్ 28) రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు గత పదేళ్ల రికార్డులను బద్దలుకొట్టాయి. నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో అత్యధికంగా 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 12 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్‌, నిర్మల్‌, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్