రెండో రోజు ముగిసిన ఆట.. భారత్‌ స్కోర్‌ 145/3

లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 251/4తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ 387 పరుగులకు ఆలౌట్‌ అయింది. రూట్‌ (104) శతకం చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆట ముగిసే సమయానికి 145/3 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (53), రిషభ్‌ పంత్‌ (19) క్రీజులో ఉన్నారు. కరుణ్‌ (40), జైస్వాల్‌ (13), గిల్‌ (16) పరుగులు చేశారు.

సంబంధిత పోస్ట్