మావోయిస్టులకు ఎస్సై అన్నం పెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఛత్తీస్‌గఢ్ లోని కాంకేర్ జిల్లాలో ఈ ఘటన చోసుకుంది. అడవిలో పోలీసులు, మావోయిస్టులు ఎదురుపడ్డారు. అప్పటికే దండకారణ్యంలో చాలా దూరం నుంచి మావోయిస్టులు కాలినడకన రావడంతో, మావోయిస్టులకు పార్తాపూర్ ఎస్సై రామేశ్వర్ అన్నంపెట్టినట్లు సమాచారం. అనంతరం జనజీవన స్రవంతిలో కలిపినట్లు తెలుస్తోంది.