అడవి పందులను చంపి తినడమే పరిష్కారం: వ్యవసాయ శాఖ మంత్రి

ప్రజా వినతిపై కేరళ వ్యవసాయ‌ మంత్రి పి. ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం పాలమేల్ గ్రామ పంచాయతీ సమావేశంలో పాల్గొన్న ఆయనను.. అడవి పందుల సమస్యను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ఈ సమస్యకు అడవి పందులను చంపి తినడమే పరిష్కారమని.. వేరే మార్గం లేదని ఆయన సూచించారు. అయితే పంట నష్టాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అడవి పందులను చంపి వాటిని తినేందుకు కేంద్రం ప్రజలకు అనుమతులివ్వాలని అన్నారు. కాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్