తులం బంగారం స్కీమ్ అమలుకు రంగం సిద్ధం!

TG: ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన 'మహిళలకు తులం బంగారం' హామీని అమలు చేసేందుకు కసరత్తు పూర్తయింది. ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. 18ఏళ్లు నిండి రాష్ట్రంలో స్థిరపడిన వారికే ఈ పథకం వర్తించనుంది. పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలలోపు కుటుంబ వార్షికాదాయం ఉన్న వారు అర్హులు. ఈ నిబంధనలను అధికారులు CMకు అందించగా త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్