మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్రబృందం తెలుగు రాష్ట్రాల అభిమానుల కోసం జూన్ 1న విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశముందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు.