కుంభమేళాలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరం: పవన్‌

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనలో 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమైన ఘటన అని పేర్కొన్నారు. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాల కోసం కోట్ల మంది వచ్చిన క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మహా కుంభమేళాకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్