జ్ఞాను, ఇంకా రంగా బిల్లాల కథ ముగిసింది: ప్రకాశ్ రాజ్

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనం అయిందని, ఇక 'జ్ఞాను' నిమజ్జనమే మిగిలి ఉందని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా.. 'జ్ఞాను, ఇంకా రంగా బిల్లాల కథ ముగిసింది. మన మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను కీర్తిస్తూ సంబరాలు చేసుకుంటున్న కొందరు గూండాలున్నారు. SIR ద్వారా మన పౌరసత్వాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తోంది కూడా ఇదే గూండాలు. కానీ ఈ దేశ యువత, పౌర సమాజం, కాక్రోచెస్ దీన్ని జరగనివ్వరు’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕