డిజిటల్ యుగంలో పౌరాణిక నాటకాల పట్ల ఆసక్తి తగ్గుతున్న వేళ, పాకిస్థాన్ కరాచీలో ఓ నాటక బృందం ‘రామాయణం’ను రంగస్థల నాటకంగా ప్రదర్శించింది. ‘మౌజ్’ బృందం రూపొందించిన ఈ నాటకాన్ని మొత్తం పాకిస్థానీయులే ప్రదర్శించారు. డైరెక్టర్ యోగేశ్వర్ కరేరా, సీత పాత్రధారి రాణా కజ్మా తదితరులు నాటకానికి ప్రాణం పోశారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శనకు స్థానికుల నుంచి విశేషంగా స్పందన లభించింది.