తెలంగాణలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారి రేషన్ కార్డులను రద్దు అవుతాయనే ప్రచారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. కొత్త కార్డుల నెపంతో పాత వాటిని తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆమె విమర్శించారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, గల్ఫ్ కార్మికుల కార్డులను తొలగించడం అన్యాయమని, 15 లక్షల కార్డుల తొలగింపు సర్వేను వెంటనే నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. రేషన్ ద్వారా తీసుకునే 6కిలోల బియ్యం చిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.