గల్ఫ్ కార్మికుల కన్నీటి గాథ

దూరపు కొండలు నునుపు అన్నట్టు, దూర దేశాలకు వెళ్లిన మన తెలంగాణ కార్మికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. తినటానికి తిండి లేక, చేయడానికి పనులు లేక, స్వస్థలానికి ఎలా రావాలో తెలియక అల్లాడి పోతున్నారు. ఇదిలా ఉండగా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు, కరోనా మహమ్మారి వారి పట్ల శాపంగా మారింది. కరోనా మహమ్మారి వల్ల దాదాపు ప్రపంచ దేశాలన్నీ, లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. దీంతో కంపెనీలన్నీ మూతబడి, వలస కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. దీంతో పరాయి దేశాల్లో చిక్కుకున్న కార్మికులంతా, ఇండియా తీసుకురావాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕