ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్!

TG: భూమి లేని రైతులు, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న ఈ పథకం నిధులు వారి అకౌంట్లో జమ చేయనుందని తెలుస్తోంది. ఈ పథకం కింద ప్రతీ ఏటా రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తోంది. రెండు విడతలుగా రూ.6 వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకం వల్ల వ్యవసాయంపై ఆధారపడ్డ రైతు కూలీలతో పాటు కౌలు రైతులకు లబ్ది చేకూరనుంది.

సంబంధిత పోస్ట్