AP: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సు, బైక్‌లను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.