తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానం నాగేందర్ అనర్హత వేటుతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2024 ఏప్రిల్ 23 నుండి దానం నాగేందర్‌ను అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో, మిగిలిన ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులపై ఉత్కంఠ పెరుగుతోంది. వారిపై బీఆర్ఎస్, బీజేపీ గురి పెట్టాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ కేసుల్లో చోటు చేసుకునే పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఏడుగురు ఎమ్మెల్యేల కేసుల్లో రికార్డులు, కౌంటర్ అఫిడవిట్లు సమర్పించాలని కోర్టు కోరింది.