ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర కేబినెట్ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ నెల 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో పాటు, నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ స్థానాలను 850కి పెంచే అంశాలపై కేబినెట్ కీలక చర్చలు జరిపి ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. 2029 ఎన్నికలకు ముందే వీటిని అమలు చేయడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕