అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు మంగళవారం తాత్కాలికంగా లాక్ వేయడం కలకలం రేపింది. అనుమానాస్పదంగా వ్యక్తులు దూసుకురావడంతో అధికారులు వెంటనే స్పందించి కార్యకలాపాలు నిలిపేశారు. సోదాల అనంతరం భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, కార్యకలాపాలను పునరుద్ధరించారు. ఓ పర్యాటకుడు తన ఫోన్ విసిరి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.